ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతేడాది అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక మహిళలు సికిల్ సెల్ ఎనీమియాతో పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. వీరికోసం తన సొంత నిధులతో బ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపడతామని మాట ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రోజున అరకులోయలో బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఈ నిర్మాణం చేపట్టనుంది.