హైదరాబాద్ మాదాపూర్‌లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఐటీ కంపెనీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల భవనంలో వేగంగా మంటలు వ్యాపించటంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.