Chittoor Ysrcp Leader Red Sandalwood Dump: చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత గుట్టురట్టైంది.. తనిఖీలకు వెళ్లిన పోలీసులు.. మనోడి బాగోతం బయటపెట్టారు. ఎస్‌ఆర్‌పురం మండలంపిళ్లారికుప్పంలోని మామిడి తోటలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అక్కడే ఉన్న కూలీని అరెస్టు చేశారు. దీంతో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.. అసలు నిందితుడ్ని వదిలేసి కూలీని అరెస్ట్ చేయడం దారుణమంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.