మారాం చేయొద్దు.. అసెంబ్లీకి రండి: జగన్‌కు రఘురామ పిలుపు

1 year ago 28
‘ఇది గౌరవ సభ. మిమ్మల్ని గౌరవిస్తాం. చట్టంలో లేనిదాని గురించి మారాం చేయకూడదు. న్యాయపరంగా మీకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు' అన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. చంద్రబాబు ఎవరినీ అగౌరవపరిచే వ్యక్తి కాదని.. సభకు రావాలని జగన్‌కు సూచించారు. మైకు ఇవ్వరని బయట చెప్పడం కాదు.. సభకు వస్తే తెలుస్తుంది అన్నారు. ఇంట్లో సెట్టింగ్‌ వేసుకుని మాట్లాడటం కాదని.. సభకు రావాలన్నారు. తనను ఈ స్థానంలో కూర్చోబెట్టిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్, బీజేపీ, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. తనను అరెస్టు చేసినప్పుడు చంద్రబాబు తన భార్య, పిల్లలకు ధైర్యం చెప్పారని.. అండగా నిలిచారన్నారు. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో చంద్రబాబుకు తెలుసనడానికి తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉండడమే నిదర్శనమన్నారు. సభను నిష్పాక్షికంగా నడిపిస్తానని చెప్పారు..ఎందరో ఉత్తములు ఇక్కడ చట్టాలు చేశారని.. ఈ స్థానంలో గొప్పవాళ్లు కూర్చున్నారన్నారు. గత ఐదేళ్లలో ఈ సభలో భాష మొత్తం మారిపోయిందని.. జుగుప్సాకరంగా మాట్లాడిన వారిని జనం ఓడించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనడానికి తాజా తీర్పు నిదర్శనం అన్నారు.
Read Entire Article