మారిపోనున్న అమరావతి రూపురేఖలు.. రూ.15000 కోట్లతో ఏం చేస్తామో చెప్పిన ప్రభుత్వం

1 year ago 36
అమరావతి నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు రూ.15000 కోట్లు రుణం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 15 వేల కోట్ల రూపాయలను ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రభుత్వం సీఆర్‌డీఏకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిధుల సాయంతో మౌలిక వసతుల అభివృద్ధి, కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, ఉపాధి అవకాశాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించింది. అలాగే ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి ఆర్థిక సాయం పొందేలా సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారాలు కల్పించింది. ఇక సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది.
Read Entire Article