పొరపాటున చంద్రబాబు నాయుడికి నిద్రలో ఎవరైనా మావిగన్ అంటే చాలు గుండె ఆగి చనిపోతారు అంటూ వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ‘ఎవరైనా చంద్రబాబు దగ్గర మావిగన్ అంటే గుండె ఆగిపోకపోతే అదృష్టం. మిమ్మల్ని తిట్టకపోతే.. వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే మీరంత చంద్రబాబును ఎంత మేర కరెక్ట్‌గా అంచనా వేస్తున్నారనేది మీరే చెప్పగలరు. చంద్రబాబు సీఎంగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. ఆయన రాష్ట్రానికి భవిష్యత్తులోనూ రాజధాని లేకుండా చేస్తున్నారు. లక్షల ఎకరాల్లో మౌలిక సదుపాయాలకే రూ. 2 లక్షలు కోట్లు ఖర్చు అవుతాయి. ఇది ఆచరణ సాధ్యం కాదు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతికి తెచ్చిన, కమిట్ అయిన అప్పులు రూ.47,380 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చూపుతున్నారు’ అని గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 110 కి.మీ. హైవే కారిడార్ మావిగన్‌ను రాజధాని చేయాలని మేం సూచించామన్నారు.