గత కొన్ని నెలలుగా దేశవ్యా్ప్తంగా మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు జరుగుతున్నాయి. ఇటీవలె మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కొన్ని రోజులకే ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సింహాచలం తాజా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. 40 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న సింహాచలంపై రూ. కోటి రివార్డ్ ఉంది. గతంలో ప్రభుత్వంతో జరిగిన మావోయిస్ట్ శాంతి చర్చల్లో సింహాచలం పాల్గొన్నాడు.