హైదరాబాద్‌లో హైదర్షాకోట సన్ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ దుండగులు మిట్టమధ్యాహ్నం.. కాలింగ్ బెల్ కొట్టి మరీ.. ఎవరైనా చూస్తారన్న భయం లేకుండా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. మొదటి అంతస్తులో గుర్తు తెలియని ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి వచ్చాడు. ప్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ కొట్టాడు. అప్పటికే నిద్రలో ఉన్న మహిళ.. కాసేపటికి తలుపులు తెరవగా.. ఆ మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును సదరు వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో మహిళ లబోదిబోమంటూ దొంగ వెంట పరుగులు తీసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో పట్టపగలే దొంగలే ఇలా ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతుంటే మాకిక భద్రత ఎలా ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.