Car Catches Fire: హైదరాబాద్‌లోని మియాపూర్ స్టేషన్ కింద అగ్ని ప్రమాదం సభవించింది. అది కూడా రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరిగ్గా మెట్రో స్టేషన్ కిందికి రాగానే.. కారు ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. కారును రోడ్డు పక్కనే ఆపేసి అందులో నుంచి బయటకు వచ్చాడు. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. మంటలు ఆర్పేశారు.