Miyapur Leopard: హైదరాబాద్ మియాపూర్‌లో చిరుతను పోలిన జంతువు కనిపించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచారం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటుగా వెళ్తున్న చిరుతను పోలిన జంతువు వీడియోను రికార్డు చేసిన యువకులు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు అనుమానస్పద జంతువు సంచారంపై కీలక అప్డేట్ ఇచ్చారు.