తెలంగాణ వ్యాప్తంగా మిర్చి మార్కెట్‌లో తేజా రకం మిర్చి ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ధరలు గరిష్టంగా రూ. 13,500కి చేరుకున్నాయి. ఎగుమతులు సజావుగా సాగటం, దేశీయంగా పెరుగుతున్న కొనుగోళ్లతో నాణ్యమైన మిర్చికి ధరలు పెరగడం రైతులకు ఉపశమనంగా ఉంది. ఎప్పటి నుంచో మిర్చికి ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. మరికొన్ని వారాల పాటు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.