మిస్ యూనివర్స్ - ఇండియా పోటీలకు ఎంపికైన చందనా జయరాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. కుటుంబంతో కలిసి సచివాలయంలో సీఎంను కలిశారు. ఏపీ నుంచి మిస్ యూనివర్స్ -ఇండియా పోటీలకు కుప్పానికి చెందిన చందనా జయరాం ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో తనను కలిసిన చందనా జయరాంను చంద్రబాబు అభినందించారు. పోటీల్లో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ - ఇండియా పోటీల్లోనూ గెలవాలని ఆకాంక్షించారు.