Girl Escape from kidnappers in Vijayawada: గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ బాలికను కొంతమంది దుండగులు అపహరించేందుకు యత్నించారు. విజయవాడ మీదుగా కారులో తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే విజయవాడ బస్టాండ్ వద్ద భోజనం కోసం కారు ఆపడంతో బాలిక తప్పించుకుంది. కారు ఆపిన దుండగులు డోర్ సరిగా లాక్ చేయకుండా వెళ్లిపోయారు. దీంతో చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక.. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ చేరుకుని కంట్రోల్ రూమ్ సిబ్బందికి కిడ్నాప్ సంగతి వివరించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కిడ్నాపర్లు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు.