టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే సేవలను ప్రారంభించింది. వినియోగదారులు 79016 28348 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసి, కంప్లైంట్ ఐడీ ద్వారా పురోగతిని తెలుసుకోవచ్చు. ఈ సదుపాయం సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, మెరుగైన సేవలను అందించడానికి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు.