మీ ఫోన్ హ్యాక్ అయిందా.. వాట్సాప్ వాడేవారికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బిగ్ అలర్ట్

4 months ago 3
సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను వేదికగా చేసుకొని కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకే ఫైళ్లు, కాల్ ఫార్వార్డింగ్ ట్రిక్ ద్వారా హ్యాకింగ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఆర్టీఏ చలాన్, బ్యాంక్ కేవైసీ అప్‌డేట్, కొరియర్ నోటీస్, వీడియో షేరింగ్ యాప్ వంటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపుతున్నారని.. వాటిని ఇన్‌స్టాల్ చేస్తే.. ఫోన్‌లోని మొత్తం సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.
Read Entire Article