హైదరాబాద్ మధురానగర్‌లోని మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైందన్న సీతక్క.. మహిళా సంఘాల గురించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.