కర్ణాటకలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్.. మీ రుణం తీర్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను అంటూ కాస్త భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టినపుడు.. భారీగా నిరసనలు వ్యక్తం చేసి.. తమ కుటుంబానికి అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రవాసాంధ్రులకు కర్ణాటక తల్లిలాంటిదని నారా లోకేష్ పేర్కొన్నారు.