తెలంగాణ బీజేపీలో రగులుతున్న అంతర్యుద్ధం మరోసారి బయటపడింది. ఈమధ్యే పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీలో పాత సామాను ఎక్కువైపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఈసారి మేకప్ మెన్‌లు, ఆఫీస్ బాయ్‌లకు కీలక పదవులు ఇస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.