తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. హరీష్ రావు మాట్లాడుతున్న సమయంలో.. రన్నింగ్ కామెంట్రీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "రాజగోపాల్ రెడ్డి.. మీరు హోమ్ మినిస్టర్ అయ్యాక మైక్ ఇస్తారని. ఇప్పుడు మీకు ఎలిజిబులిటీ లేదన్నారు. మీరు హోం మంత్రి కావాలి. ఐ విష్ యూ షుడ్ బికేమ్ హోమ్ మినిస్టర్.." అంటూ హరీశ్ రావు సెటైర్లు వేశారు. సభను నడిపే పద్ధతి ఇది కాదని హరీష్ రావు అన్నారు.