తెలంగాణలో వర్షాలపై భారత వాతావరణ శాక అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.