Pawan Kalyan Respond On Nagababu Minister Post: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవిపై స్పందించారు. 'మనతో పార్టీలో ప్రయాణం చేసి, పని చేసిన వారిని నేను గుర్తించాలి. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశారు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలి' అన్నారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని.. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు.. మంత్రి అంశం అనేది తర్వాత చర్చ చేస్తామని చెప్పుకొచ్చారు.