తెలంగాణలో పండగ ఏదైనా.. చాలా మందికి నాన్ వెజ్ లేకుండా సంబరం పూర్తి కాదు. ఇక్కడి ప్రజల్లో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదనే చెప్పాలి. అందుకే తెలంగాణలో మాంసం వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. NMRI సర్వే వివరాల ప్రకారం.. మాంసాహార వినియోగం పరిమాణంలో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రతి వ్యక్తి నెలకు సగటున 2 కేజీల మాంసాన్ని లాగించేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.