ముఖ్యమంత్రికి బనకచర్ల ఎక్కడుందో తెలియదు.. రాష్ట్రం పరువు తీస్తున్నారు: హరీష్ రావు

8 months ago 21
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతుల గురించి తెలిసినంతగా బేసిన్‌ల గురించి తెలియదంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు. నీటి పారుదల ప్రాజెక్టులపై అవగాహన లేని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని విమర్శించారు. దేవాదుల, బనకచర్ల ప్రాజెక్ట్ ఏ బేసిన్‌లో ఉందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని దుయ్యబట్టారు. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో బుధవారం (జూన్ 18) రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ రావు స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ‘బేసిన్‌ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు బ్యాగుల మీద నాలెడ్జ్ తప్పితే, బేసిన్‌ల మీద బేసిక్ నాలెడ్జ్ లేదు’ అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రికి నల్లమల ఎక్కడుందో తెలియదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్‌లో ఉన్న విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ఎక్కడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అడిగితే.. ఆయన సలహాదారు ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పారని.. వాస్తవానికి బనకచర్ల నంద్యాల జిల్లాలో ఉందని చెప్పుకొచ్చారు.
Read Entire Article