తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన ఏపీ విద్యార్థులకు ఇది చేదు వార్త. కొత్త నిబంధనల ప్రకారం వారికి కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లు దక్కే అవకాశం లేదు. విభజన చట్టం పదేళ్ల గడువు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికులకు 85 శాతం సీట్లు కేటాయిస్తుండగా.. మిగిలిన 15 శాతం స్థానికేతర కోటా సీట్లు తెలంగాణ మూలాలున్న వారికే దక్కనున్నాయి. దీంతో ఏపీ విద్యార్థుల ఆశలు గల్లంతయ్యాయి.