సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఆకాశంలోని ఇంద్రధనుస్తు భూమి మీదికి దిగి వాకిళ్లలో ముగ్గులుగా మారిపోతుంది. ఏ లోగిలి చూసినా.. రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతుంటాయి. అయితే.. ఆ ముగ్గులతో మహిళలు అద్దిరిపోయే బహుమతులు గెలుచుకునే సువర్ణావకాశం కల్పించింది తెలుగు ఎన్నారై రేడియో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలంతా ఈ పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకుని అవకాశాన్ని కల్పించింది.