Hyderabad Traffic Updates: తెలంగాణలో వరుణుడు గ్యాప్ లేకుండా దంచి కొడుతున్నాడు. దీంతో.. లోతట్టు ప్రాంతాలే కాకుండా.. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్- విజయవాడ హైవే కూడా వరద నీటితో మునిగిపోయింది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ వాగు ఉగ్రరూపం దాల్చటంతో.. రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ట్రాఫిక్‌ను వేరే మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు.