మున్సిపల్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా 33 మంది నేతలపై కేసు నమోదు చేశారు. కారణం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మరో 33 మంది బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.