తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీని విజయపథంలో నడిపించేందుకు సీనియర్ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల్లో భాగంగా నిజామాబాద్ బాధ్యతలను ఉత్తమ్‌కుమార్ రెడ్డికి, మల్కాజ్‌గిరిని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, చేవెళ్లను శ్రీధర్‌బాబుకు కేటాయించారు. అలాగే ఆదిలాబాద్ ఇన్-ఛార్జ్‌గా సుదర్శన్ రెడ్డి, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం బాధ్యతలను కొండా సురేఖకు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయి ప్రచారం వరకు ఈ మంత్రులే పర్యవేక్షించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తు జరుగుతోంది.