ములుగు జిల్లా రద్దు అవుతుందనే వార్తలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. ఈ ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ములుగు జిల్లా ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీనే పోరాడిందని, తాము ఎందుకు రద్దు చేస్తామని ప్రశ్నించారు. గత ప్రభుత్వం శాస్త్రీయంగా ఆలోచించకుండానే జిల్లాల సరిహద్దులు నిర్ణయించిందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మెరుగుపరచడానికి చిన్నపాటి మార్పులు చేస్తారని మాత్రమే చెప్పారని, జిల్లా రద్దు కాదని ఆమె స్పష్టం చేశారు.