తెలంగాణ అడవుల్లో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం.