ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో డిసెంబర్ ఒకటో తారీఖున జరిగిన ఎన్‌కౌంటర్‌పై మంగళవారం (డిసెంబర్ 3న) హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఏడుగురిలో ఆరుగురు చత్తీస్‌ఘడ్‌కు చెందిన వాళ్లు ఉండగా.. ఒకరు తెలంగాణకు చెందిన మల్లయ్య మృతదేహాన్ని భద్రపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.