అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి ప్రాణం పోయింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అనే విద్యార్థి అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలలో ఉంది. అయితే ఇటీవలే కుటుంసభ్యులతో మాట్లాడిన ఆమె.. జలుబు, ఆయాసంగా ఉందని చెప్పింది. డాక్టర్ వద్దకు వెళ్లడానికి అపాయింట్‌మెంట్ కూడా తీసుకుంది. అయితే ఈలోపే చనిపోయినట్లు ఆమె స్నేహితులు తెలిపారు.