మూడేళ్లలో అధికారంలోకి వస్తాం.. ఆ అధికారుల భరతం పడతాం: కేటీఆర్

7 months ago 9
తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏమి చేయలేకపోయారన్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత కచ్చితంగా రైతుబంధు పథకాన్ని నిలిపివేస్తారని ఆరోపించారు. ఈ విషయంపై కేబినెట్‌లో కూడా చర్చించారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతు బంధు పథకాన్ని నిలిపివేస్తారని ఆనాడు కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు.
Read Entire Article