గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఆదివారం కూకట్‌పల్లి, అమీన్‌పూర్ ప్రాంతాల్లో ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, షెడ్లు నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని.. అంతలోనే కూల్చేవేశారని ఓ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.