మూసీ ప్రాజెక్టుకు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు కోసం ఒడ్డున ఉన్న కుటుంబాలను తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా మరో వివాదం తలెత్తింది. మూసీ ప్రాజెక్టు పేరుతో నదీ తీరంలో భారీగా పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఎన్‌హెచ్‌ఆర్సీలో కేసు నమోదైంది. పర్యావరణంపై ప్రభావం చూపే చెట్ల నరికివేతను తక్షణమే ఆపాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్ఆర్‌సీ దర్యాప్తు చేస్తోంది.