హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆరు కోచ్‌ల మెట్రో రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 60 కోచ్‌లతో 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నారు. ఒక్కో రైలులో సుమారు 2 వేల మంది ప్రయాణించే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉన్న సామర్థ్యం దాదాపు రెట్టింపు కానుంది. డీఎంఆర్‌సీ సాంకేతిక ప్రమాణాలు రూపొందించిన తర్వాత టెండర్లు పిలవనున్నారు. రైళ్ల తయారీకి సుమారు 24 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త రైళ్లతో రద్దీ తగ్గడంతోపాటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షల నుంచి 6 లక్షలకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.