హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉపశమనంగా.. L&TMRHL సంస్థ టక్కీట్‌తో కలిసి స్మార్ట్ లాకర్ల సదుపాయాన్ని ప్రారంభించింది. ప్రయాణంలో సామాన్లు, హెల్మెట్లు వంటి వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవడం దీని ఉద్దేశం. తొలుత మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట సహా ఏడు స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, డిజిటల్‌గా చెల్లింపు జరిపి.. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇది మెట్రో స్టేషన్లను మల్టీ-యుటిలిటీ హబ్‌లుగా మార్చే దిశగా వేసిన ముందడుగుగా చెప్పుకోవచ్చు.