మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. దీనిపై త్వరలోనే విచారణకు రావాలంటూ అంబటి రాంబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ మెట్ల మీద బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు.