గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గురువారం రాత్రి నార్సింగి–వల్లూర్ మధ్యన నర్సరీ సమీపంలో రోడ్డుపై తీవ్రగాయాలతో పడి ఉన్న చిరుతను వాహనదారులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యం కోసం చిరుతను తరలించేందుకుప్రయత్నిస్తున్నా క్రమంలోనే అది ప్రాణాలు కోల్పోయింది. నడుము, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో అది మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.