ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రారంభించేందుకు మే 10న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఇక ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు 3 లక్షల మందిని సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇక మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు రానుండటంతో బీజేపీ నేతల్లో సరికొత్త జోష్ నెలకొంది.