జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మెుత్తం 8 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని పెళ్లైన 29 రోజులకే తేజేశ్వర్‌ను తిరుమలరావు, ఐశ్వర్య కలిసి సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి వీరి మధ్య చర్చ జరిగిందని.. ఆ కేసులా దొరకకూడదని జాగ్రత్త పడినట్లు తెలిసింది. హత్య అనంతరం లద్దాఖ్ పారిపోయి సహజీవనం చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు.