మేడారం గద్దెల వద్ద శిల పడి కాలు కోల్పోయిన బాలుడు యువిన్ కుటుంబానికి మంత్రి సీతక్క ఇచ్చిన హామీని నెరవేర్చారు. బాలుడి తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం కల్పిస్తూ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. గత నెలలో జరిగిన ప్రమాదంలో యువిన్ ఎడమ కాలును వైద్యులు తొలగించాల్సి వచ్చింది. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగం కల్పించి ప్రభుత్వం అండగా నిలిచింది.