సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చిన మహిళల వరుస హత్యల కేసు తీవ్ర సంచలనం రేపింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ మహిళ తన మైనర్ కుమారుడిని నేరాల్లోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను టార్గెట్ చేసి బంగారం, నగదు దోచుకున్న అనంతరం హత్యలు చేసి మృతదేహాలను పెట్రోల్‌తో తగులబెట్టేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. సగం కాలిన మృతదేహం కేసులో నిందితురాలు, మైనర్ బాలుడు పోలీసులకు చిక్కారు.