తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సంబురాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. కుతుబ్‌షాహీల కాలం నుండి కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో, భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీరసారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ, లాల్ దర్వాజ అమ్మవార్లకు కూడా బోనాలు సమర్పించనున్నారు. మరి గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు సమర్పిస్తారు అంటే..