మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్ జగన్, అల్లు అర్జున్ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అలాగే రాజు బలవంతుడైతే శత్రువులు అందరూ ఏకమవుతారంటూ కొటేషన్ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది.