తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పలువురు నేతలకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవలె టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఎస్ఐఆర్ నోటీసులు అందించిన బీఎల్వోలు.. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పేరు ఓటరు జాబితాలో తప్పుగా నమోదైందని.. ఆధారాలు సమర్పించాలని అధికారులు కోరారు. ఇక మహేశ్ కుమార్ గౌడ్ ఇంటిపేరు కూడా గతంలో కంటే వేరుగా ఉండటంతో నోటీసులు జారీ అయ్యాయి.