తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల ద్వారా వస్తువులను రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వస్తువు రకం.. బరువును బట్టి వాటికి రుసుం వసూలు చేస్తారు. అయితే ఇలా కార్గో ద్వారా వస్తువులను బుక్ చేసి.. డెలివరీ పాయింట్ వద్ద ఎవరూ ఆ వస్తువులను స్వీకరించకపోతే.. ఆ వస్తువులను వేలం ద్వారా అమ్మడం జరుగుతుంది. ఒక వస్తువును కార్గొ పాయింట్స్ వద్ద 45 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచరు. ఇలా కార్గో సర్వీస్ పాయింట్ ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు.. మరికొన్ని వస్తువులు ఎవరూ తీసుకెళ్లకపోవడంతో అలానే ఉన్నాయి. వీటిని వేలం ద్వారా విక్రయించనున్నారు.