మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం పైలట్ రోహిత్ రెడ్డి.. దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులను కోర్టు విధించింది. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు, మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.