టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు ఇంకా చల్లారలేదు. ఈ క్రమంలో ఆయన కుమారుడు మంచు మనోజ్ ఇవాళ తన తండ్రికి చెందిన తిరుపతి మోహన్ బాబు యూనివర్శిటీకి చేరుకున్నారు. భార్య మౌనికా రెడ్డితో కలిసి ఆయన వర్శిటీకి చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాదు నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంచు మనోజ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ దంపతులు చేరుకున్నారు.