Mohan babu Family Controversy: మంచువారి ఫ్యామిలీ ఫైట్‌లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా జరుగుతున్న గొడవలతో పాటు మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణతో పోలీసులు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో.. పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా.. భారీ ఊరట లభించింది. విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని హైకోర్టు ఉపశమనం కలిగించింది.